తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. పోలీస్‌ ఉద్యోగాలు

* 1సెం.మీ తక్కువ ఎత్తు ఉన్న అభ్యర్ధులకు తిరిగి అవకాశం కల్పించాలన్న కోర్టు

Dhatripriya
Published on: 9 Feb 2023 9:14 AM IST
Telangana High Court Decision About Police Jobs
X

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. పోలీస్‌ ఉద్యోగాలు

High Court: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో ఒక సెంటీమీటరు తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు.. తిరిగి అవకాశం కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి మరోసారి హైట్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ నియామక మండలి అధికారులు నిర్ణయించింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి ఇటీవల దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించింది, నిర్దేశించిన ఎత్తుకంటే 1 సెంటీమీటరు తక్కువ ఎత్తు ఉన్న వాళ్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనలు కొనసాగించారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అభ్యర్ధులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Dhatripriya

Dhatripriya

Next Story