TGCET: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాలు..దరఖాస్తుల గడువు పొడిగింపు..ఈనెల 23న రాత పరీక్ష

Dhivi
Updated on: 2 Feb 2025 6:08 PM IST
TGCET: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాలు..దరఖాస్తుల గడువు పొడిగింపు..ఈనెల 23న రాత పరీక్ష
X

TGCET: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అయితే ఈ గడువును ఫిబ్రవరి 6వ తేదీ వరకు పొడిగించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు.

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతిలో అడ్మిషన్లకు ప్రాసెస్ కొనసాగుతోంది. 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ కూడా కొనసాగుతోంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీనే ఈ గడువు ముగిసింది. దీంతో అధికారులు తాజాగా అప్ డేట్ ఇచ్చారు. ఈ గడువును ఫిబ్రవరి 6వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ఈలోపే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారు.

అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికలు ఫిబ్రవరి 6వ తేదీలోకా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 23 వ తేదీ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు పరీక్ష ఉంటుంది.

అభ్యర్థులు వారి అర్హతలను పరిశీలించుకుని ఫిబ్రవరి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు. మరో దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు. అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అలాంటి వారిపై సెక్షన్ 416 ఆఫ్ ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల ఎంపికకు ఉమ్మడి జిల్లా ఒక యూనిట్ గా తీసుకుంటారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశపరీక్షలో ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థికి మరింత సమాచారం అవసరం అయితే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు. 040 23120431 నెంబర్లను సంప్రదించవచ్చు.

Dhivi

Dhivi

Next Story