Telangana: 24 గంటలు షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి.. వార్షిక ఫీజు ఎంతో తెలుసా?

Telangana Govt Allows 24x7 Functioning for Shops
x

Telangana: 24 గంటలు షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి.. వార్షిక ఫీజు ఎంతో తెలుసా?

Highlights

Telangana News: తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.

Telangana News: తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై 24 గంటలూ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. ఈ మేరకు 1988 చట్టానికి సవరణలు చేసింది ప్రభుత్వం. 24 గంటలు షాపులు తెరిచే స్టోర్లు ఏటా 10వేల ఫీజు చెల్లించాలని తెలిపింది ప్రభుత్వం.

ఇక రాత్రి వేళల్లో తెరిచి ఉంచే స్టోర్లకు కొన్ని నిబంధనలు కూడా విధించింది ప్రభుత్వం. అదనపు సమయం ఉద్యోగం చేస్తే ఓటీ చెల్లించాలని తెలిపింది. పబ్లిక్ హాలిడే రోజు పనిచేస్తే వేతనం ఇచ్చేలా నిబంధన విధించింది. రాత్రి వేళల్లో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయాల్సి వస్తే.. వారి అనుమతి తీసుకుని షిఫ్ట్‌లు వేయాలని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు రవాణా సదుపాయం కూడా కల్పించాలని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories