Birthday Greetings To President Ramnath Kovind : రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

Birthday Greetings To President Ramnath Kovind : రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై
x
Highlights

Birthday Greetings To President Ramnath Kovind : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ కి జన్మదిన...

Birthday Greetings To President Ramnath Kovind : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా గవర్నర్ తమిళసై ఈ విధంగా శుభాకాంక్షలను పలికారు. 'భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ మార్గ నిర్దేశంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశారు.

ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతదేశపు 14వ రాష్ట్రపతి. అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు భీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నాడు. ఆయన 1994 నుండి 2006 వరకు భారత పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. ఆయనని రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రం లోని ఎన్.డి.ఎ ప్రభుత్వం ఎంపిక చేసింది. 2017 రాష్ట్రపతి ఎన్నికలలో ఆయన భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. భారత రాష్ట్రపతి పదవినలంకరించిన దళిత వ్యక్తులలో ఈయన రెండవవారు. రాజకీయాలలోనికి ప్రవేశించక పూర్వం అతను 1993 వరకు,16 సంవత్సరాలపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయవాదిగా ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories