ఆ రెండు ప్రాజెక్టుల అనుమతులు నిలిపివేయండి.. కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు..!

Telangana Government Writes Letter to Centre Over Water Projects
x

ఆ రెండు ప్రాజెక్టుల అనుమతులు నిలిపివేయండి.. కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు..!

Highlights

Telangana: కేంద్ర జ‌ల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

Telangana: కేంద్ర జ‌ల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. క‌ర్ణాట‌కలోని అప్పర్ తుంగ‌, అప్పర్ భ‌ద్ర ప్రాజెక్టుల‌కు అనుమ‌తుల‌పై అభ్యంత‌రం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజ‌ల్ డైరెక్టరేట్‌కు ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ లేఖ రాశారు. రెండు ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు నిలిపివేయాల‌ని లేఖ‌లో విజ్ఞప్తి చేశారు. అంత‌ర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యున‌ల్ తీర్పుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరారు. ఈ రెండింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా అనుమ‌తులు ఇవ్వరాద‌ని సూచించారు.

అనుమ‌తులిస్తే కృష్ణాకు తుంగ‌భ‌ద్ర నుంచి ప్రవాహం తగ్గుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజ‌నాల‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుంద‌న్నారు. ఈ రెండు ప్రాజెక్టుల‌కు బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులు చేయ‌లేద‌ని ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ స్పష్టం చేశారు. బ్రిజేష్ ట్రైబునల్ కేటాయింపులున్నా.. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని గుర్తు చేశారు. దిగువ‌న ఉన్న రాష్ట్రాల అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories