Telangana: బడ్జెట్‌పై సమీక్షలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ

Telangana: నేటి నుంచి బడ్జెట్ ప్రిపరేషన్‌పై వరుస సమీక్షలు

Jyothi
Published on: 18 Jan 2024 8:46 AM IST
Telangana Government is Ready to Review the Budget
X

Telangana: బడ్జెట్‌పై సమీక్షలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ

Telangana: తెలంగాణ బడ్జెట్ కసరత్తులో భాగంగా శాఖల వారీ సమీక్షలు ఇవాళ్టి నుంచి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ వ్యవసాయశాఖ, రెవెన్యూ, సమాచార శాఖపై సమీక్ష జరగనుంది. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు, ఆర్థిక భారానికి సంబంధించి విడిగా నివేదిక సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ఆయా శాఖలకు సూచించింది. 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. రోజుకు ఇద్దరు చొప్పున మంత్రులకు సంబంధించిన శాఖలతో డిప్యూటీ సీఎం సమావేశం జరగనుంది.

Jyothi

Jyothi

Next Story