బడ్జెట్‌పై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్న తెలంగాణ సర్కార్‌

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 30 Jan 2023 3:40 PM IST
Telangana Government has Withdrawn the Lunch Motion Petition on the Budget
X

బడ్జెట్‌పై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్న తెలంగాణ సర్కార్‌

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్‌‌‌ను సర్కార్ ఉపసంహరించుకుంది. హైకోర్టులో బడ్జెట్‌పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీలో మార్పు జరిగింది. ఫిబ్రవరి 3న గవర్నర్‌ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 6న బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story