TS Government: మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

TS Government: గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు

Shekhar G
Updated on: 22 Feb 2024 5:05 PM IST
Telangana Government Has Decided To Implement Two More Guarantees Upcoming Week
X

Revanth Reddy: మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

TS Government: ఆరు గ్యారెంటీల హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసింది. తాజాగా...మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గ్యారెంటీల అమలు విధివిధానాలపై కేబినెట్ సబ్‌ కమిటీతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27లేదా 29న మరో రెండు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత కరెంట్‌తో పాటు 500రూపాయలకు సిలిండర్‌ పథకాన్ని రేవంత్‌ సర్కార్‌ ప్రారంభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 955 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది. దీనిలో 40రూపాయల్ని కేంద్రం సబ్సిడీ భరిస్తోంది. అంటే 915 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌ను 500రూపాయలకు ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఐతే ఈ సబ్సిడీని రేషన్‌ కార్డు ఉన్నవారికే ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story