Telangana: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్న 8340 మెడికల్ సీట్లు

Shekhar G
Published on: 4 July 2023 2:07 PM IST
Telangana Government Gave Good News To The Medical Students
X

Telangana: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

Telangana: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్ ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. AP రీ ఆర్గనైజషన్ ఆక్ట్ మరియు ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ ను సవరించింది. దీని ద్వారా 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. గతంలో 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు, 15 శాతం ఇతరులకు కేటాయించేవారు. ఈ విధానంలో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు MBBS సీట్ల కోసం పోటీ పడేవారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ విద్యార్థులకే ఎక్కువ సీట్లు దక్కుతాయి.

తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిచడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతీ జిల్లాకు ఒకమెడికల్ కాలేజీ ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీల్లో 8340 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2,850 సీట్లలో అన్ రిజర్వుడ్ కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సీట్లు పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది.

దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరించింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభించనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదం గా ఉంటాయి. దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.

తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story