Telangana: తెలంగాణలో చివరి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న అధికార, విపక్షాలు

Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన

Shekhar G
Updated on: 1 Aug 2023 9:30 PM IST
Last Assembly Sessions In Telangana
X

Telangana: అసెంబ్లీ సమావేశాల్లో Congress,BJP ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు KCR భారీ వ్యూహం..!

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సైతం సిద్ధమవుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై ఎదురుదాడికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా పార్టీలను ఇరుకునపెట్టే అంశాలపై కసరత్తును ప్రారంభించారు. మరోవైపు వరద నష్ట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని కేంద్రంపై విమర్శలు సంధించనున్నారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సారి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో గత 9 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రభుత్వ విజయాలను అసెంబ్లీ వేదికగా వివరించనున్నారు.

అసెంబ్లీ సమావేశాలను ఎన్నికలకు వేదికగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలపై ఇరుకునపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా గత పాలన వైఫల్యాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విధానాలను సభలో ఎండగట్టనున్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే గత పరిస్థితులే ఎదురవుతాయని ప్రజలకు వివరించే అవకాశం ఉంది.

కేంద్రం విభజన అంశాలపై నిర్లక్ష్యం, ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చకపోవడం అంశాలను ప్రస్తావించి బీజేపీపై దాడి చేసే అవకాశం ఉంది. గతేడాది రాష్ట్రంలో కురిసిన వరద నష్టంపై కేంద్రం అంచనా వేసినా నిధులు కేటాయించలేదని, అదే విధంగా హైదరాబాద్‌లో జరిగిన నష్టానికి నిధులు కేటాయించలేదని, బీజేపీ నేతలు సైతం బండిపోతే బండి.. అని ప్రకటన చేసి చేతులు దులుపుకోవడం తదితర అంశాలపై కార్నర్ చేయాలని చూస్తున్నారు.

మరోవైపు 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, దళితబంధు, బీసీలకు లక్షసాయం, మైనార్టీలకు లక్ష, హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, ఆర్టీసీ విలీనం, వరంగల్, ఖమ్మం అభివృద్ధి, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, విద్యార్థులకు డైట్ చార్జీలు పెంపు వంటి అంశాలను వివరించనున్నారు. ప్రతి పథకాన్ని సుదీర్ఘంగా చర్చించడంతో పాటు ఎంతమంది లబ్ధి పొందారనే అంశాన్ని క్లుప్తంగా వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story