బయటివారు జీహెచ్ఎంసీ దాటి వెళ్లాలి: ఎస్‌ఈసీ

బయటివారు జీహెచ్ఎంసీ దాటి వెళ్లాలి: ఎస్‌ఈసీ
x
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశించారు. 22వేల 272 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్లపాటు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు కమిషనర్‌ పార్థసారథి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి డిసెంబర్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 74,67,256 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 38,89,637 పురుషులు, మహిళలు 35,76,941 మంది, 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తంగా 9,101 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. వాటిలో 22,272 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు.

డిసెంబర్ 1న పోలింగ్, 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లకు జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 1122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106 డివిజన్లలో పోటీకి దిగాయి. ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, స్వతంత్ర అభ్యర్థులుగా 415 మంది పోటీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories