CS Somesh Kumar: తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌

CS Somesh Kumar: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Arun Chilukuri
Published on: 6 April 2021 4:37 PM IST
Telangana CS Somesh Kumar Tested as Corona Positive
X

CS Somesh Kumar: తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌

CS Somesh Kumar: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా సీఎస్‌ సోమేష్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు సీఎస్‌. నిన్న సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు సోమేష్‌ కుమార్‌. ఇటీవల సీఎస్ సోమేశ్ కుమార్ కరోనా సహా, వివిధ రంగాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ సమీక్షల్లో కొన్నింటిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎస్‌కు పాజిటివ్ అని నిర్ధారణ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనను ప్రత్యక్షంగా కలిసిన వారంతా ఐసోలేషన్‌లో ఉండి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎస్ కోరారు. ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం సీఎం కేసీఆర్‍తో సోమేష్‍కుమార్ సమావేశమైయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story