Telangana Covid19 Tests in Private Laboratory: ప్రైవేట్ ల్యాబ్‌ల పరీక్షల్లో కరోనా కేసులు ఎక్కువ.. నిపుణుల కమిటీతో విచారణ

Telangana Coronavirus Tests: తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Samba Siva Rao
Published on: 4 July 2020 9:15 AM IST
Telangana Covid19 Tests in Private Laboratory: ప్రైవేట్ ల్యాబ్‌ల పరీక్షల్లో కరోనా కేసులు ఎక్కువ.. నిపుణుల కమిటీతో విచారణ
X

Telangana Coronavirus Tests: తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనం నగరం విడిచి పల్లెల బాట పట్టారు. ప్రైవేట్ ల్యాబొరేటరీల కరోనా టెస్టులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ల్యాబ్‌లకు పరీక్షలకు అనుమతి ఇచ్చిన నాటి నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షల్లో 71.7 శాతం పాజిటివ్‌గా తేలడం అధికారులు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకుప్రైవేట్ ల్యాబ్ 3,726 శాంపిళ్లను పరీక్షించగా.. 2,672 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని శుక్రవారం (జులై 3) విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. దీనిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించాల్సి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. కొవిడ్ 19 నిర్ధారణ పరీక్షల్లో ప్రమాణాలు పాటించని ఓ ప్రైవేటు ల్యాబ్‌పై వేటు పడింది.

తెలంగాణలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగిపోతోంది. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,892 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత మూడు రోజులుగా రాష్ట్రంలో వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు పాజిటివ్‌గా తేలింది. ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తాజా ఫలితాల్లోనూ జీహెచ్‌ఎంసీలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నట్లుగా వెల్లడైంది.

రాష్ట్రం మొత్తంమీద అత్యధికంగా 1,658 కేసులు హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. రంగారెడ్డి (56), మేడ్చల్‌ (44), సంగారెడ్డి (20), వరంగల్‌ గ్రామీణ (41) జిల్లాల్లోనూ వైరస్‌ విజృంభిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 20,462కు పెరిగింది. శుక్రవారం నాటి ఫలితాల్లో 24 జిల్లాల్లో పాజిటివ్‌లు గుర్తించారు. అత్యధికంగా 5,965 నమూనాలను పరీక్షించగా, వాటిలో 31.7 శాతం పాజిటివ్‌లు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 1,04,118కి పెరిగింది. ఇందులో 83,656 మందిలో వైరస్‌ లేదని నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 9,984 మంది చికిత్స పొందుతున్నారు. 1,126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 10,195 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కరోనాతో మరో 8 మంది మృతిచెందగా, ఇప్పటి వరకూ మొత్తం కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 283కు పెరిగింది. కోలుకున్నవారు పది వేల మంది


Samba Siva Rao

Samba Siva Rao

Next Story