కుమ్రం భీమ్ జిల్లాలో తుపాకి మిస్ ఫైర్

admin1
Published on: 22 Feb 2020 7:08 PM IST
కుమ్రం భీమ్ జిల్లాలో తుపాకి మిస్ ఫైర్
X

కుమ్రం భీమ్ జిల్లా తిర్యాని పోలీస్‌స్టేషన్‌లో తుపాకి పేలింది. తుపాకిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ కిరణ్ కుమార్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటుపల్లి వాసి. 13 బెటాలియన్ కి చెందిన కిరణ్ కుమార్ గత ఐదు నెలలుగా తిర్యాని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.

admin1

admin1

Next Story