హైదరాబాద్‌కు టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్

హైదరాబాద్‌కు టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఇవాళ, రేపు గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై సమీక్షించనున్నారు. ఇక...

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఇవాళ, రేపు గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై సమీక్షించనున్నారు. ఇక ఇవాళ హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల నేతలతో చర్చించనున్నారు. రేపు నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష జరపనున్నారు. అలాగే నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే ఈ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం పట్టభద్రుల స్థానానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానానికి ఏఐసీసీ కార్యదర్శి జి.చెన్నారెడ్డి పేర్లు ఖరారయినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories