CM Revanth Reddy: ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 6 Dec 2025 12:24 PM IST
CM Revanth Reddy: ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
X

CM Revanth Reddy: ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థా్పనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. దేవరకొండ శివారులోని శేరిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. మహిళా సంగాలకు బ్యాంకు లింకేజీలో భాగంగా 11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దేవరకొండలోని బీఎన్ఆర్ కాలనీలో రెండు కోట్లలతో పార్కు నిర్మాణం, ప్రభుత్వ బాలుర కాలేజీలో రెండు కోట్లతో స్టేడియం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, రెండున్నర కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సీఎం శంకు స్థాపన చేయనున్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్, ఎమ్మెల్యే బాలు నాయక్ పరిశీలించారు. సీఎం రేవంత్ పర్యటనలో జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొంటారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story