Revanth Reddy: పదేళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆరే

Revanth Reddy: కృష్ణానదీ జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదు?

Jyothi
Published on: 12 Feb 2024 2:07 PM IST
Telangana CM Revanth Reddy Fire On KCR
X

Revanth Reddy: పదేళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆరే

Revanth Reddy: తెలంగాణ సమాజానికి ప్రాణ సమానమైన కృష్ణానదీ జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేశారని విమర్శించారు. పదేళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆరే అంటూ ఫైర్ అయ్యారు.

కృష్ణా జలాల్లో వాటాలను ఎవరు అమ్ముకున్నారు? ఎవరు చాపల పులుసుకు అలుసిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను సభకు రమ్మనాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతసేపు మాట్లాడినా మైక్ ఇస్తామని.. తాము కూడా సమాధానం చెప్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

Jyothi

Jyothi

Next Story