ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ.. ఆ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్
విద్యుత్ చట్టాని సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు.
KCR, Narendra Modi (file photo)
విద్యుత్ చట్టాని సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు అభిప్రాయపడ్డారు.
కేంద్రం ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కోరింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ రాశారు. ఆ చట్టం వల్ల రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై భారం పడుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆ బిల్లు ఉపసంహరణ డిమాండ్ సీఎం కేసీఆర్ చేశారు.
Next Story




