telangana cm kcr with media live

S. Srikanth
Updated on: 22 March 2020 7:15 PM IST
telangana cm kcr with media live
X
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు..

Live Updates

  • 22 March 2020 7:22 PM IST

    మార్చి 31వ వరకూ తెలంగాణ లాక్‌డౌన్.. బియ్యంతో పాటు 1500 నగదు..

    కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.-పూర్తి కథనం  

  • 22 March 2020 6:51 PM IST

    - ఇంట్లోంచి ఎవరూ బయటకు రావద్దు.

    - స్వీయ నిరంత్రనే శ్రీరామ రక్ష

  • 22 March 2020 6:36 PM IST

    - ప్రసవానికి సిద్ధంగా న గర్భిణీలకు కావలసిన అమమోవి.. ఆడుపత్రికి తరలించడం వంటి పనులు చేపడతాం

    - అత్యవసర ఆపరేషన్లకు మాత్రమె అనుమతి ఇస్తున్నాం. అత్యవసరం కాని ఆపరేషన్లను నెలరోజులు వాయిదా వేస్తున్నాం

    - పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా ఆపెస్తున్నాం 

    - బస్సులు, ఆటోలు, క్యాబ్ లు తిరగాబోవు.

  • 22 March 2020 6:33 PM IST

    - అత్యవసర్ సర్వీసుల వారు మాత్రం నూరు శాతం పనిచేయాల్సి ఉంటుంది.

    - మిగిలిన వారు 20 శాతం మంది అదీ కూడా రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు.

    - కాంటాక్ట్ లేబర్, భావన నిర్మాణ కార్మికులకు. ఇతర అసంఘటిత కార్మికులకు పెయిడ్ హాలిడే ప్రకటించాలి. వారం రోజుల జీతం ఆయా యాజమాన్యాలు చెల్లించాలి.

  • 22 March 2020 6:30 PM IST

    నిరుపేదలకు నెలరోజులకు సరిపడే బియ్యం ఇస్తాం

    - ఒక్కో వ్యక్తికీ 12 కిలోల బియ్యం తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇస్తాం.

  • 22 March 2020 6:28 PM IST

    - ఈనెల 31 వరకూ తెలంగాణా వ్యాప్తంగా లాక్ దౌన్ ప్రకటిస్తున్నాం 

  • 22 March 2020 6:27 PM IST

    -రాష్ట్రంలో ఇప్పటివరకూ 26 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

    - అందరూ క్షేమంగా ఉన్నారు 

    - అందరూ కేశమంగా ఉండాలనే కోరుకుంటున్నాం 

  • 22 March 2020 6:25 PM IST

    - ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

    - సంఘీభావ సంకేతానికి అపూర్వ స్పందన వచ్చింది.

S. Srikanth

S. Srikanth

Next Story