Independence Day 2021: హైదరాబాద్‌ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు

Independence Day 2021: ఉదయం 10.30గంటలకు జెండావిష‌్కరణ చేయనున్న సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Updated on: 15 Aug 2021 1:05 PM IST
Telangana CM KCR Unfurls National Flag at Golconda Fort
X

గోల్కొండకోట వద్ద జెండావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్ (ఫైల్ ఇమేజ్)

Independence Day 2021: హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జాతీయ జెండావిష్కరణకు సర్వం సిద్ధమైంది. పదిన్నరగంటలకు సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతీ ఏటా గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. సైనిక విన్యాసాలు, తెలంగాణ రాష్ట్ర ఉనికిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ప్రజలకు అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేశారు.

2018లో ఇచ్చిన హామీలు, చేసిన పనులను రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా సీఎం కేసీఆర్ వివరించనున్నారు. తెలంగాణ దళిత బంధు, రైతు రుణమాఫీ, నూతన సచివాలయం, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, జిల్లాల కలెక్టర్ ఆఫీస్‌ల భవనాలు, చేనేత బీమా ఇలా అనేక అంశాలను, ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి లభ్యతతో పెరిగిన వ్యవసాయ సాగు, నోటిఫికేషన్లపై సీఎం వివరించనున్నారు.

గోల్కొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకుల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. 32 జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్నిఆవిష్కరిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story