CM KCR Review on Coronavirus: హైకోర్టు వ్యాఖ్యలు బాధకలిగిస్తున్నాయి.. సీఎం కేసీఆర్ తో అధికారులు!

CM KCR Review on Coronavirus: హైకోర్టు వ్యాఖ్యలు బాధకలిగిస్తున్నాయి.. సీఎం కేసీఆర్ తో అధికారులు!
x
CM KCR (File Photo)
Highlights

CM KCR Review on Coronavirus: కరోనా పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల

CM KCR Review on Coronavirus: కరోనా వైరస్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటుగా పలువురు పాల్గొన్నారు. అందులో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి మెరుగ్గానే ఉందని అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని, ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు.

ఇక ఈ సమీక్షలో కరోనా విషయంలో హైకోర్టులో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు-చికిత్స విషయంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం పట్ల సమావేశంలో పాల్గొన్న పలువురు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.

కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికి హైకోర్టు 87 పిల్స్ ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని అన్నారు. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తునన్నమని, ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తుదని అన్నారు.

ఇక కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయని, ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నదని సమావేశంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. అయితే వారి అభిప్రాయాలను ఓపికగా విన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా సమయంలో వైద్యం అందిస్తున్న తీరు, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories