తెలంగాణా సీఎం కేసీఆర్ రిక్వెస్ట్.. ఏపీ సీఎం జగన్ స్పీడ్ రెస్పాన్స్!

తెలంగాణా సీఎం కేసీఆర్ రిక్వెస్ట్.. ఏపీ సీఎం జగన్ స్పీడ్ రెస్పాన్స్!
x
Highlights

CM KCR Request To Jagan : భారీ వర్షాలు హైదరాబాద్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి భారీగా ఆస్థి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది.

CM KCR Request To Jagan : ఒక పక్కా కరోనాతో నగరవాసులు ఇబ్బంది పడుతుంటే మరో పక్కా వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి భారీగా ఆస్థి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. దీనితో హైదరాబాదు నగరంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.. కాస్తా బ్రేక్ ఇస్తూ వరుణుడు బాగ్యనగారాన్ని ముంచెత్తుతున్నాడు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రాబోయే 24 గంటల నుంచి 48 గంటల వరకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తం అ‍య్యింది.

ముందుగా ముప్పు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ సాయం కోరారు. వరద బాధితులను త్వరగా రక్షించేందుకు స్పీడ్‌ బోట్స్‌ అవసరమని సీఎం కేసీఆర్ భావించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం జగన్‌ సాయం కోరారు కేసీఆర్.. కేసీఆర్ కోరిన వెంటనే జగన్ కూడా స్పందించి తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక వరద భాదితుల కు తెలంగాణ సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచారు. వ‌ర‌ద నీటి ప్ర‌భావానికి గురైన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌తి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా నగరంలోని పేదప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సాయం మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే ప్రారంభిస్తామ‌ని ఆయన వెల్ల‌డించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలన్నారు కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories