కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్‌

admin1
Published on: 1 Feb 2020 8:35 PM IST
కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్‌
X

కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశజనకంగా ఉందని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 2020-21 బడ్జెట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రస్తుత కేటాయింపులు తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అనేది.. రాజ్యాంగ పరమైన హక్కు అని.. తగ్గించడం అనేది కేంద్ర ప్రభుత్వ అసమర్థత అని అన్నారు.

admin1

admin1

Next Story