Top
logo

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
X
Highlights

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. కరోనా సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో రెండు నెలల పాటు విధించిన 50 శాతం కోతను చెల్లిస్తున్నట్టు ప్రకటించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. కరోనా సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో రెండు నెలల పాటు విధించిన 50 శాతం కోతను చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. దీనికోసం దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్సిల్‌ సర్వీసుల బిజినెస్‌ 1 మిలియన్‌ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను కేసీఆర్ అభినందించారు. ఇకపై.. హైదరాబాద్‌లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Web TitleTelangana cm KCR Good News for RTC Employees
Next Story