నేడు ఉద్యోగ సంఘాలతో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

Telangana: 317, 46 జీవోలపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ

Jyothi
Published on: 14 March 2024 8:44 AM IST
Telangana Cabinet Sub Committee Meeting
X

నేడు ఉద్యోగ సంఘాలతో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

Telangana: ఇవాళ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతలతో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ కానుంది. జీవో నంబర్ 317, 46 లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశం జరనుండగా.. ఉద్యోగ సంఘాల నుంచి జీవో నంబర్ 317, జీవో నంబర్ 46 లపై అభ్యంతరాలు, సలహాలు తీసుకోనున్నారు. గతంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రెండు జీవోల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అధికారులు మంత్రులకు వివరించారు. దీంతో మరోసారి సమావేశానికి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఉద్యోగులు, తమ అభిప్రాయాలు కమిటీకి చెప్పుకునేందుకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే నేడు సబ్ కమిటీ మరో సారి భేటీ కానుంది.

Jyothi

Jyothi

Next Story