Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ

Telangana Cabinet: పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం

Jyothi
Published on: 12 March 2024 8:54 AM IST
Telangana Cabinet Meeting Today
X

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ

Telangana Cabinet: నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు 2,500 పథకంపై చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాలను ఆమోదించనున్నట్లు సమాచారం.

ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రావొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మంత్రివర్గం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సిఫార్సుల మేరకు క్రిమినల్ కేసుల నమోదు లేదా విశ్రాంత జడ్జిలతో విచారణ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story