ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet: బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

Jyothi
Updated on: 4 Feb 2024 9:16 AM IST
Telangana Cabinet Meeting Today
X

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 8వ తేదీన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆ తర్వాత బీఏసీలో పెట్టనున్నారు.

దీంతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌లో రాష్ట్ర కోడ్‌గా మార్చాలన్న నిర్ణయం కూడా తీసుకునే అవకాశముంది. గత ప్రభుత్వం టీఎస్‌గా చేసిన ఈ కోడ్‌ను టీజీగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. మరో ఇరవై ప్రధాన అంశాలపై కూడా నేడు కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే ఆరు గ్యారంటీలపైన కూడా చర్చించే అవకాశముంది.

Jyothi

Jyothi

Next Story