నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. 50 అంశాలపై చర్చ

TS Cabinet: వర్షాలు, వరదలు, వ్యవసాయంపై ప్రధాన చర్చ

Jyothi
Published on: 31 July 2023 9:28 AM IST
Telangana Cabinet Meeting Today
X

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. 50 అంశాలపై చర్చ

TS Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనుంది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపై చర్చించనుంది. ప్రత్యామ్నాయ సాగు విధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story