Assembly Session: ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ భేటీ

Assembly Session: ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ భేటీ
x
Highlights

Assembly Session: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం. ఇందుకోసం బీసీ రిజర్వేషన్ల పెంపుపై దృష్టి సారించిందని...

Assembly Session: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం. ఇందుకోసం బీసీ రిజర్వేషన్ల పెంపుపై దృష్టి సారించిందని సమాచారం. దీనిలో భాగంగానే కులగణన సర్వే నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఫిబ్రవరి 7న ఒక్క రోజు శాసనసభ సమావేశం నిర్వహించి కులగణన సర్వే నివేదికను ఆమోదింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈమధ్యే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోనూ చర్చించి..సమావేశానికి అనుమతి తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఆమోదం తర్వాత తదుపరి కసరత్తు పూర్తి చేసి మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటివారం వరకు అమల్లో ఉంటుంది. దీన్ని కొనసాగిస్తూ మార్చి రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories