Local Body Elections: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. అంతా సిద్ధంగా ఉండండి

CM Revanth Reddy says houses will be allotted to tribal people
x

TS Government: బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే వారందరికీ ఇండ్లు?

Highlights

Local Body Elections: త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను...

Local Body Elections: త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విధిగా తీసుకెళ్ళేందుకు క్షేత్రస్థాయిలో నాయకులు కీలకపాత్ర పోషించాలని వారికి సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్నాయో ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలు, స్థానిక నాయకత్వాల మధ్య ఉన్న అంతరాలు తదితర అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడం కోసం తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ సింగ్ భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని వివరించారు. మన్మోహన్ సింగ్ హయంలోనే తెలంగాణ వచ్చిందన్నారు. పాత బస్తిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టామని తెలిపారు. జనవరి 26వ తేదీన రైతు భరోసా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 21వేల కోట్లతో రుణమాఫీ చేశామని.. ఒక ఏడాదిలోనే 54 వేల కోట్లు రైతుల సంక్షేమ కోసం ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటివరకు 4000వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించినట్లు ఆయన తెలిపారు.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ ఇప్పటినుంచే ఊళ్లలో ఎన్నికల సందడి షురూ అయ్యింది. కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలపై ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా ఎన్నికల రావడమే ఆలస్యం ప్రచారాలకు రెడీ అయిపోతున్నారు కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories