తెలంగాణా బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటే అవకాశం?

త్వరలో తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

K V D Varma
Published on: 19 Aug 2019 11:13 AM IST
తెలంగాణా బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటే అవకాశం?
X

త్వరలో తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్తికశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1.82 లక్షల కోట్లతో దీనిని ప్రవేశ పెట్టారు. అయితే, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ సిద్దం చేస్తున్నారు. ఇది ఓటాన్ మించి ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో అన్ని శాఖల అధికారులతో బడ్జెట్ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి సమావేశం ఏర్పాటు చేశారు.


K V D Varma

K V D Varma

Next Story