Telangana Bonalu: సందడి లేని బోనాల పండుగ

Telangana Bonalu: సందడి లేని బోనాల పండుగ
x
Highlights

ఆశాడ మాసం వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులు ఘటాల భరాత్ లు ఇలా అన్నీ కలిసిన బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. కానీ...

ఆశాడ మాసం వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులు ఘటాల భరాత్ లు ఇలా అన్నీ కలిసిన బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. కానీ ఈ సారి ఎలాంటి ఆర్భాటాలు లేని బోనాల పండుగ ప్రారంభం అయిపోయింది. ఆశాడ మాసం లో మొదటి బోనంతో ప్రారంభమైన గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల పై ఓ స్టోరి.

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బోనాలు. ఆషాడమాసంలో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగే ఈ పండుగ ప్రారంభం అయింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గోల్కొండ కోట దగ్గర ఈ బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఆశాడ మాసం లో వచ్చే మొదటి గురువారం రోజు నుంచి ప్రారంభమై నెలరోజుల పాటు వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. అందులో భాగంగా తొలి రోజున శ్రీ జగదాంబికా దేవాలయం మొదటి పూజతో ఉత్సవాలు ఆరంభమై, జూలై 23వ తేదీ తొమ్మిదవ పూజతో ముగుస్తాయి.

ప్రతి సంవత్సరం ఈ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కును తీర్చుకుంటారు. కోరిన భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే ఈ అమ్మవారిని జంటనగరాల లో చాలా ప్రాంతాల నుంచి బోనాలు తీసుకు వచ్చి సమర్పిస్తారు. తెలంగాణ జిల్లాల ప్రజలు ఆరాధ్యదైవంగా పూజిస్తున్న శ్రీ జగదాంబిక అమ్మవారికి ఈ సారి ఆలయ పూజారులే బోనం సమర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో భక్తులను ఇంటి దగ్గరే బోనాలు సమర్పించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో ఎప్పుడూ సందడిగా ఉండే గోల్కొండ పరిసరాలు బోసిపోయాయి. అమ్మావారికి బోనం పెడితే ఎంతటి వైరస్ బాక్టిరియాలు అయినా తుడిచి పెట్టుకు పోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకోసమే ఇంట్లో అయినా సరే బోనం ఎత్తి అమ్మలకు పూజలు చేస్తామంటున్నారు భక్తజనం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories