BJP MlAs: ప్రొటెం స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన

BJP MlAs: అసెంబ్లీ 2 వ గేటు దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2023 5:28 PM IST
Telangana BJP MLA Protest at Assembly
X

BJP MlAs: ప్రొటెం స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన

BJP MlAs: అసెంబ్లీ 2 వ గేటు దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమించడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. అంతలోనే అక్కడి చేరుకున్న పోలీసులు బీజేపీ ఎమ్మెల్మేలను వారించారు.. దీంతో రెండో గేటు దగ్గర బైఠాయించిన నిరసన తెలిపారు. అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ నియామకంతోనే.. కాంగ్రెస్.. ఎంఐఎం ఒక్కటేనని అర్ధం అయ్యిందని మండిపడ్డారు. రజకార్ల వారసులను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story