Kishan Reddy: ఢిల్లీ వెళ్లిన బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి

Kishan Reddy: మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరుకానున్న కిషన్‌రెడ్డి

Jyothi
Updated on: 3 March 2024 1:30 PM IST
Telangana BJP Chief Kishan Reddy Went to Delhi
X

Kishan Reddy: ఢిల్లీ వెళ్లిన బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి

Kishan Reddy: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ అక్కడ జరిగే మినిస్టర్స్ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇక రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్న దృష్ట్యా.. టూర్ వివరాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కూడా హైకమాండ్‌తో చర్చించే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే 9 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఇక తర్వాత ప్రకటించబోయే లిస్టుపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇటు పార్టీలో చేరికలపై కూడా హైకమాండ్‌తో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. అన్ని అంశాలపై చర్చ తర్వాత సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు కిషన్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story