Bandi Sanjay Padayatra: పాదయాత్రపై బండి సంజయ్ కీలక ప్రకటన

Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు సర్వం సిద్ధమయింది.

Arun Chilukuri
Published on: 7 Aug 2021 4:17 PM IST
Telangana BJP Chief Bandi Sanjay Padayatra Begins From August 24
X

బండి సంజయ్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు సర్వం సిద్ధమయింది. ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడం, బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

ఈ నెల 24న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ సర్కార్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందన్న బండి తన పాదయాత్ర ద్వారా తెలంగాణలో పెను మార్పులు ఖాయం అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story