Breaking News: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

Breaking News: బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Jyothi
Published on: 23 Aug 2022 11:23 AM IST
Telangana BJP Chief Bandi Sanjay Arrested At Jangaon District
X

Breaking News: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

Breaking News: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా దీక్షకు దిగుతున్న బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు.. బండి సంజయ్ ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడానికి..

నిరసనగా బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు సిద్ధమైన బండి సంజయ్ ను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం ముదిరింది. నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పాటు పలువురు బీజేపీ నేతలపై కేసులు కూడా నమోదు చేశారు. దీనికి నిరసనగా ప్రజాసంగ్రామ యాత్రలో బస చేసిన చోటే దీక్షకు సిద్ధమయ్యారు బండి సంజయ్. పాదయాత్రలో దీక్షకు దిగుతుండగా ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

Jyothi

Jyothi

Next Story