TS News: ఇవాళ సరూర్‌నగర్‌లో తెలంగాణ భరోసా సభ

TS News: సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ చీఫ్ మాయావతి

Dhatripriya
Published on: 7 May 2023 11:14 AM IST
Telangana Bharosa Sabha In Saroornagar Today
X

TS News: ఇవాళ సరూర్‌నగర్‌లో తెలంగాణ భరోసా సభ

TS News: బీఎస్పీ ఆధ్వర్యంలో ఇవాళ సరూర్‌నగర్‌ స్టేడియంలో తెలంగాణ భరోసా సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మాయావతి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాల వివరాల గురించి రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్య నాయకులతో కలిసి మాయావతి చర్చించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక మొదటి సారి ఆమె తెలంగాణ రావడం, సభలో ఏం మాట్లాడుతారనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story