Harish Rao: రాష్ట్రంలో తగ్గిన మాతాశిశు మరణాలు.. దేశవ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ

Harish Rao: సీఎం కేసీఆర్‌ పరిపాలనకు ఇది నిదర్శనం

Shekhar G
Published on: 20 Aug 2023 4:21 PM IST
Telangana At 3rd Place In Country With Reducing Maternal Mortality
X

Harish Rao: రాష్ట్రంలో తగ్గిన మాతాశిశు మరణాలు.. దేశవ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ

Harish Rao: మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశిశు మరణాల సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో ఎంసీహెచ్‌ బ్లాక్‌, 33 నియోనేటల్‌ అంబులెన్సులను మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. గాంధీ హాస్పిటల్‌లో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో గర్భిణులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసమే ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story