TS Assembly: ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పున ప్రారంభం

TS Assembly: బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సభలో సమర్పించనున్న ప్రభుత్వం

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 7:16 AM IST
Telangana Assembly Meeting Restarts From Today
X
తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఇమేజ్)

TS Assembly: ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పున ప్రారంభం కానున్నాయి. ఈనెల 24న సమావేశమైన ఉభయ సభలు ప్రారంభమం అయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం సభలు వాయిదా పడ్డాయి. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను ఇవాళ సభలో సమర్పించనున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉభయ సభలకు సమర్పిస్తారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు బిల్లు, కొండాలక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనిర్సిటీ సవరణ బిల్లు సభ ముందుకు రానున్నాయి. అలాగే పంచాయితీ రాజ్ సవరణ బిల్లు, నల్సార్ యూనివర్సి సవరణ బిల్లు కూడా సభలో ప్రస్తావించనున్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత ఐటీ పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై అసెంబ్లీలో చర్చ జరగనునంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story