సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల భేటీ

సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల భేటీ
x
Highlights

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల మధ్య కూడా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. అయితే గత కొన్ని రోజుల క్రిందటే లాక్‌డౌన్‌ లో సడలింపులు ఇవ్వడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. కానీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో రెండు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల రవాణాశాఖ ఆధికారుల మధ్య చర్చులు జరిగాయి. అయినా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ర‌వాణా శాఖ మంత్రులు సోమవారం భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుపుటకు ఉన్న ప్రతిష్టంబన తొలగించుట కోసం రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ సోమవరం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి ఇరు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో పాటు ఆర్టీసీ ఎండీలు, అధికారులు హాజ‌రు కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సులు న‌డిపే విష‌య‌మై భేటీలో చ‌ర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories