అచ్చెన్నాయుడుపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్

Arun Chilukuri
Updated on: 12 Jun 2020 2:23 PM IST
అచ్చెన్నాయుడుపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్
X

hmtv తో మంత్రి పేర్ని నాని, చంద్రబాబు ఇంగిత ఙానం కొల్పోయి మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో అటవిక పాలన చేశారు. టీడీపీ హయాంలో అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టకుండా సీఎంగా ఉండి పంచాయతీలు చేసిన నేత చంద్రబాబు. మంత్రిగా ఉండి అచ్చెన్నాయుడు అడ్డగోలుగా వ్యవహరించారు.

కార్మికుల రెక్కల కష్టాన్ని హల్వా తిన్నట్టు తినేశారు. ఏపీ బీసీలకు ఆత్మ గౌరవం మెండుగా ఉంది. బీసీ కులంలో అచ్చెన్నాయుడు చెడబుట్టారు. కార్మికుల కష్టాన్ని దోచిన అచ్చెన్నాయుడు మన బీసీల్లో ఎందుకు పుట్టారని బీసీలు అనుకుంటున్నారు. బీసీ కాబట్టే అరెస్ట్ చేయకూడదంటే బీసీలూ సహించరు. దొంగను విచారణ చేయడమేంటీ..? దొంగతనం జరిగింది.. లూటీ జరిగింది.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది.. ఇంకా విచారణ ఏంటీ..? తానే కాకుండా మరి కొందరు అధికారులనూ అచ్చెన్నాయుడు జైలుకు తీసుకెళ్తున్నారు. చేసిన పనికి సిగ్గు పడాలి అని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story