Warangal: ఘనంగా తీజ్‌ వేడుకలు.. 9 రోజుల పాటు జరుపుకునే పండుగ

Warangal: పెళ్లికాని యువతులు జరుపుకునే పండుగ

Shekhar G
Published on: 22 Aug 2023 1:43 PM IST
Teej Celebrations Are Grand In Warangal District
X

Warangal: ఘనంగా తీజ్‌ వేడుకలు.. 9 రోజుల పాటు జరుపుకునే పండుగ

Warangal: గిరిజన తండాలలో లంబాడ తెగలకు చెందిన పెళ్ళి కాని ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్. కాలం మారుతున్న తమ పూర్వీకుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ నేటికి వాటిని ఆచరిస్తున్నారు. లంబాడా యువతులు తొమ్మిది రోజులపాటు కఠిన నియమాలు ఆచరిస్తూ, భక్తిశ్రద్ధలతో దేవతలను పూజిస్తారు. శ్రావణ మాసంలో జరిగే ఈ తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. యువతి, యవకులు కలిసి జోర్దార్ స్టేపులతో ఆదరగొట్టారు. వెదురు బుట్టలలో గోధుమల నారు పెంచి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరి పై ఉంచి తిమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేస్తారు. గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తీజ్ పండగను ప్రభుత్వం గుర్తింపునివ్వాలని గిరిజనుల కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story