Lakdikapul: లక్డీకపూల్‌ విద్యాశాఖ‌ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన టీచర్లు

Lakdikapul: జీవో 317 రద్దు చేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన

Dhatripriya
Published on: 23 Jan 2023 2:36 PM IST
Teachers Besieged The Lakdikapul Education Commissioner Office
X

Lakdikapul: లక్డీకపూల్‌ విద్యాశాఖ‌ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన టీచర్లు

Lakdikapul: జీవో 317 వ్యతిరేకంగా టీచర్లు లక్డీకపూల్‌లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు కార్యాలయం గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అంతేకాక కార్యాలయంలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. దీంతో మోర్చా నాయకులు స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను బాధపెడుతూ ప్రభుత్వం వేధిస్తుందని రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story