Sangareddy: ప్రభుత్వ పాఠశాలలో విషాదం.. స్కూల్‌లో గుండెపోటుతో టీచర్‌ మృతి..

Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అందరూ హ‌డ‌లిపోతున్నారు.

Arun Chilukuri
Updated on: 19 April 2023 7:15 PM IST
Teacher Dies of Heart Attack in School at Sangareddy
X

Sangareddy: ప్రభుత్వ పాఠశాలలో విషాదం.. స్కూల్‌లో గుండెపోటుతో టీచర్‌ మృతి..

Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అందరూ హ‌డ‌లిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్కూల్‌లోనే గుండెపోటుతో మృతిచెందింది.

చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పద్మలత బుధవారం పాఠాలు చెబుతోంది. ఈ క్రమంలో మధ్యలో తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగింది. అనంతరం, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆమె మృతిపట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story