హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం

TDP Polit Buro Meeting At NTR Bhavan Hyderabad
x

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం

Highlights

* కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభంకానున్న పొలిట్‌ బ్యూరో భేటీ

Hyderabad: కాసేపట్లో హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభం కానుంది. దీనికి తెలుగు రాష్ట్రాల పొలిట్‌ బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్ధం చేయనుంది టీడీపీ. మే లో మహానాడు నిర్వహణ, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చతో పాటు పలు తీర్మానాలు చేయనుంది. ఇక.. తెలంగాణకు సంబంధించి 4 అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టం, కష్టాల్లో రైతాంగం, అమలుకాని ప్రభుత్వ హామీలు, ఇంటింటికీ తెలుగుదేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. మరోవైపు.. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పార్టీ ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు రెండు రాష్ట్రాల పొలిట్‌ బ్యూరో సభ్యులతో పాటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories