Telangana Governor: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజీనామా

Telangana Governor: రిజైన్‌ లెటర్‌ను రాష్ట్రపతికి పంపిన తమిళిసై

Jyothi
Updated on: 18 March 2024 11:36 AM IST
Tamilisai Resigns as Governor of Telangana
X

Telangana Governor: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

Telangana Governor: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసై రాజీనామాను గవర్నర్ కార్యాలయం ధ్రువీకరించినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు తమిళిసై. అయితే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కన్యాకుమారి, తిరుణాల్వేరి చెన్నై సౌత్ నుంచి లోక్‌సభకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక తమిళిసై రాజీనామాతో తెలంగాణకు ఇన్‌ఛార్జ్‌ గవర్నర్‌గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Jyothi

Jyothi

Next Story