Talasani Srinivas Yadav: కాంగ్రెస్‌తో పొత్తు అనే మాటే లేదు

Talasani Srinivas Yadav: మళ్లీ బీఆర్ఎస్ పూర్తి మెజార్టీతో గెలుస్తుంది

Jyothi
Published on: 15 Feb 2023 5:23 PM IST
Talasani Srinivas Yadav said that there is No Alliance With Congress Party
X

Talasani Srinivas Yadav: కాంగ్రెస్‌తో పొత్తు అనే మాటే లేదు

Talasani Srinivas Yadav: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అంబర్‌పేటలో చేసిన అభివృద్ధిపై చర్చలకు సిద్ధమా అని అడిగారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని.. కిషన్‌రెడ్డి ఒకే అంటే చర్చ పెడతామన్నారు. కేంద్రమంత్రిగా ఉండి అంబర్‌పేట, సికింద్రాబాద్‌కు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక కోమటిరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఎవరితో పొత్తు అవసరం లేదన్నారు. తెలంగాణలో హంగ్ రాదని.. పూర్తి మెజార్టీతో మళ్లీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story