Tahsildar Nagaraju case Updates: నాగరాజుకు అమెరికాలో బినామీలు.. సర్వే నెంబరు లాక్ చేసి డబ్బులు గుంచిన తహశీల్ధార్

Tahsildar  Nagaraju case Updates: నాగరాజుకు అమెరికాలో బినామీలు.. సర్వే నెంబరు లాక్ చేసి డబ్బులు గుంచిన తహశీల్ధార్
x
Tahsildar Nagaraju case Updates
Highlights

Tahsildar Nagaraju case Updates: నాగరాజు ఢొంకా ఇంకా కదులుతూనే ఉంది. ఆయనకు చెందిన బీరువాల్లో పలు రకాలైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడుతున్నాయి. వీటికి సంబందించి అమెరికాలో బినామీలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Tahsildar Nagaraju case Updates: నాగరాజు ఢొంకా ఇంకా కదులుతూనే ఉంది. ఆయనకు చెందిన బీరువాల్లో పలు రకాలైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడుతున్నాయి. వీటికి సంబందించి అమెరికాలో బినామీలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన కీసర తాసిల్దార్‌ నాగరాజు కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే నాగరాజు సహా మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కాప్రా, అల్వాల్‌, కీసరల్లో నాగరాజు ఇల్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న పలు కీలక భూ దస్ర్తాలను ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నారు. వీటిలో పదుల సంఖ్యకు పైగా కీలక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మరేమైనా ఆస్తులు కూడబెట్టాడా? అన్నది కూపీ లాగుతున్నారు. సోదాల్లో భాగంగా నాగరాజుకు సంబంధించిన ఓ బ్యాంకు లాకర్‌ తాళం చెవిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లాకర్‌ను ఓపెన్‌ చేస్తే మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని ఏసీబీ అధికారుల భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పత్రాల ప్రకారం నాగరాజుకు సహకరించినవారి జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న నాగరాజును నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలిసింది.

అక్రమాలకు పాల్పడిందిలా..

భూరికార్డుల నిబంధనలను తుంగలోతొక్కిన తాసిల్దార్‌ నాగరాజు నిర్ణీత సర్వే నంబర్‌లో స్థలవిస్తీర్ణం అధికంగా లేకున్నా.. డబుల్‌ ఎం ట్రీస్‌ లేకు న్నా వాటిని బ్లాక్‌ చేసి ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేస్తాడు. ఆన్‌లైన్‌ పహాణీలు రాకపోవడం, డిజిటల్‌ సంతకం లేకపోవడంతో బాధితులు లబోదిబోమం టూ తాసిల్దార్‌ను సంప్రదిస్తారు. ఈ సమయంలో డబ్బు డిమాండ్‌ చేస్తాడు. కీసర మండలంలో 30% భూములను బ్లాక్‌ చేసినట్టు తెలిసింది.

రాంపల్లి దాయరలో ఏసీబీ సోదాలు

కీసర మండలం రాంపల్లిదాయరలోని వివాదాస్పద భూమికి సంబంధించి రియల్టర్‌ కందాడి అంజిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంజిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డికి చెందిన పలు లెటర్‌ప్యాడ్స్‌, వివాదాస్పద భూములపై ఆర్టీఐ కింద వేసిన అర్జీలపై ఆరా కోసం ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం నుంచి సోదాలు చేపట్టారు.

బెంజ్‌ కారులో వచ్చిందెవరు?

ఏసీబీ సోదాలు ముగిసిన తర్వాత శనివారం ఉదయం అల్వాల్‌లోని నాగరాజు ఇంటి వద్దకు ఓ బెంజ్‌కారు వేగంగా దూసుకొచ్చింది. అంతలోనే ఓ వ్యక్తి నాగరాజు ఇంట్లోంచి కొన్ని పత్రాలు పట్టుకొని పరుగున వచ్చి బెంజ్‌కారులో ఎక్కాడు. ఆ కారు వేగంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్నోవా వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తులున్నారు. ఇద్దరిలో ఒక్కరు మాజీ రౌడీషీటర్‌. అతనికి నాగరాజు కుటుంబసభ్యులు కొన్ని పత్రాలను ఇచ్చి పంపినట్టు స్థానికులు చెప్తున్నారు. పలు ఆస్తుల కీలక పత్రాలను వారికి అందించి జాగ్రత్త పడినట్టు తెలిసింది. అతని ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఉదయం వేళ ఇంటి దగ్గర ఆయన సాగించే దర్బార్‌ తెలుస్తుందని స్థానికులు అంటున్నారు.

అమెరికాలో బినామీలు!

నాగరాజు తన అక్రమ ఆస్తులను అమెరికాలో ఉన్న మిత్రుల పేరునా కొనుగోలు చేసినట్టు సమాచారం. నగదు మర్వాడీ సేట్ల వద్ద పెట్టగా అమెరికాలో ఉంటున్న మిత్రుల పేరిట మీద ఏఎస్‌రావునగర్‌, అల్వాల్‌, బొల్లారం, కొంపల్లి ప్రాంతాల్లో ఖరీదైన ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.ఈ క్రమంలో మర్వాడీసేట్లతో కలిసి పలు రాష్ర్టాలకు విలాసాల కోసం వెళ్ళినట్టు తెలుస్తున్నది. వీరందరినీ విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories