Top
logo

తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం.. రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్ధార్

తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం.. రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్ధార్
X
Highlights

Tahsildhar Caught by Taking Bribe: భూములకు ఎప్పుడైతే ధరలు పెరిగాయో...రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే పుట్టుకొస్తున్నారు.

Tahsildhar Caught by Taking Bribe: భూములకు ఎప్పుడైతే ధరలు పెరిగాయో...రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే పుట్టుకొస్తున్నారు. దీంతో పాటు వీటిపై జరిగే అవినీతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. స్వంత ఆస్తికి ఆధారాలు ఇచ్చే ఘటనల నుంచి ఎవరిదో భూమిని దొంగ పేరుతో పట్టాలు చేయించడంలో ఈ అవినీతి హెచ్చు మీరుతోంది. వీటిలో ప్రధానంగా రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరిగింది. వేలు, లక్షలు కాదు... ఏకంగా రూ. కోటి పది లక్షలు... ఏదో తెలుగు సినిమాలో చెబుతాడు.., కోటి రూపాయలు.. లెక్కెట్టడానికే రోజు పట్టిందని.. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందంటే అవతలి వాడికి ఎంతటి ప్రతిఫలం దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నడూ లేనంత సొమ్మను ఏసీబీ అధికారులు పట్టుకుని, రెవెన్యూ అధికారులతో పాటు వాటికి సంబంధించిన వ్యక్తులను సైతం అరెస్టు చేశారు.

అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే తొలసారి. ఓ ప్రభుత్వాధికారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. కోటి. పది లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే ఈ ఘటనలో బాధితులెవ్వరూ పిర్యాదు చేయకుండానే నేరుగా ఏసీబీ అధికారులే నిఘా పెట్టి నాగరాజ్ అనే అతి పెద్ద అవినీతి వ్యక్తిని పట్టుకున్నారు. నాగరాజ్ కీసర తహశీల్దార్ కాగా, ఇతడిని నోట్ల కట్టల్లో ముంచేసి భూముల్ని కొట్టేద్దామనుకున్న ఓ ప్రముఖ నేత అనుచరుడిని, మరో్ దళారిని, వీఆర్ఏను ఈ ఘటనలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

మేడ్చల్ జిల్లా, కీసర మండలం రాంపల్లి దాయర సర్వే నెంబర్లు 604 నుంచి 614 వరకు పూర్వీకుల నుంచి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డవో ఉత్తర్వులు జారీచేశారు. మిగిలిన 28ఏకరాలకు సంబంధించి భూ వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. రైతులు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ స్థిరాస్తి వ్యాపార సంస్థ కన్ను వీటిపై పడింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే భాధ్యతను ఓ పార్టీకి చెందిన సీనియర్ నేత అనుచరుడు కీసరకు చెందిన అంజిరెడ్డి, ఉప్పల్ కు చెందిన దళారి శ్రీనాధ్, తీసుకున్నారు. తప్పుడు పత్రాలతో పాసు పుస్తకాలు ఇప్పించేందుకు చక్రం తిప్పారు. ఈ విషయంలో సాయం చేస్తే భారీగా ముట్టజెపుతామంటూ కీసర తహశీల్దారు నాగరాజ్ ఇంటికి అంజిరెడ్డి, శ్రీనాద్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. అప్పటికే పిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు నాగరాజ్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. తహశీల్ధార్ ఇంట్లో మరో రూ. 25లక్ష్లలు దొరికాయి.Web TitleSensation in Telugu states Tahsildhar caught by taking bribe of Rs one crore ten lakhs in Hyderabad
Next Story