అధికారులకు చుక్కలు చూపించిన కరోనా బాధితుడు

అధికారులకు చుక్కలు చూపించిన కరోనా బాధితుడు
x
Highlights

Covid victim creates ruckus in Khammam: ఖమ్మం జిల్లాలో అధికారులకు కరోనా బాధితుడు చుక్కలు చూపించాడు. మూడు రోజుల గాలింపు అనంతరం ఎట్టకేలకు...

Covid victim creates ruckus in Khammam: ఖమ్మం జిల్లాలో అధికారులకు కరోనా బాధితుడు చుక్కలు చూపించాడు. మూడు రోజుల గాలింపు అనంతరం ఎట్టకేలకు పట్టుకుని క్వారంటైన్ సెంటర్ కి తరలించారు పోలీసులు. ఖమ్మం గ్రామీణం మండలం మద్దులపల్లి కరోనా క్వారంటైన్ కేంద్రం నుంచి బాధితుడు పరారీ అయ్యాడు. గురువారం క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన చింతకాని మండలానికి చెందిన వ్యక్తి , ఖమ్మం గ్రామీణం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కోవిడ్ సెంటర్ అధికారులు. ఖమ్మం రూరల్ మండలం మద్దుల పల్లి కోవిడ్ కేంద్రం నుండి తప్పించుక పోయిన కోవిడ్ బాదితుడిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. తెల్దారుపల్లి సమీపంలో ఓ పొలంలో తలదాచుకున్నాడు బాధితుడు. మూడు రోజులుగా తిండి లేకుండా వర్షంలోనే తడిసి ముద్దైన బాధితుడు, క్వారంటైన్ కేంద్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులతోనే పారిపోయినట్లు చెబుతున్నాడు కరోనా బాధితుడు.


Show Full Article
Print Article
Next Story
More Stories